అన్నమయ్య: నందలూరు మండలంలోని ఆడపూరు గ్రామంలో వెలసిన శ్రీ మంచాలమ్మ తిరుణాలను నేడు వైభవంగా నిర్వహించునున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. అమ్మవారికి ఉదయం అభిషేకం, మధ్యాహ్నం పొంగళ్ళు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం, పండరి భజన, రాత్రి గ్రామోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది.