అన్నమయ్య: నందలూరు మండలం టంగుటూరు గ్రామంలోని ఊటుకూరు బయట కంపచెట్లలో బుధవారం పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు రాబడిన సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి 9 మంది జూదరుల నుంచి రూ. 7,820 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.