W.G: తణుకు మండలం యర్రనీలిగుంటలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక వృద్ధురాలు గాయపడ్డారు. స్థానిక ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న గుబ్బల కస్తూరి నివాసంలో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కస్తూరి రెండు కాళ్లకు స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం తణుకులో ఆస్పత్రికి తరలించారు.