KDP: కలసపాడు(M) చెన్నారెడ్డిపల్లెలో అకాల వర్షం రైతుకు తీవ్ర నష్టం మిగిల్చింది. తొండం పేరయ్య సాగుచేసిన సజ్జ పంట చేతికి వచ్చిన సమయంలోనే పూర్తిగా నేలకూలిపోయింది. ఇదే కాకుండా పొలంలో ఉన్న విద్యుత్ స్తంభం, ట్రాన్స్ ఫార్మర్ కూడా దెబ్బతినడంతో పరిస్థితి మరింత విషమించింది. ఈ నష్టంతో రైతు ఆర్థికంగా కుదేలయ్యాడు. ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని వేడుకుంటున్నాడు.