ASR: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని అరకులోయ మండలంలోని దేవాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెలుగువారి నూతన సంవత్సర ఉగాది పర్వదినం పురష్కరించుకొని గురువారం అరకులోయ ఆలయాలలోని స్వామివార్లకు భక్తులు తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకున్నారు.