KDP; తాడేపల్లిలో YS జగన్ను పలువురు YCP జిల్లా నేతలు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పులివెందుల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి, ఇడుపులపాయ మాజీ సర్పంచ్ శంకరయ్య, ఎంపీటీసీ వెంకటనారాయణరెడ్డి, కుమ్మరాంపల్లి గంగాధర, రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ సీఎంకు పుష్పగుచ్చం అందజేసి ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. జగన్ వారిని ఆప్యాయంగా పలకరించినట్లు తెలిపారు.