ఎన్టీఆర్: తిరువూరులో గురువారం నూతన ఆర్డీవోగా కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి చేరుకున్న అనంతరం ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడం తన ప్రధాన లక్ష్యమని, ముఖ్యంగా రెవెన్యూ సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానన్నారు.