KRNL:ఉగాది పండుగ పురస్కరించుకొని పెద్దకడబురు మం. తారాపురంలో వెలిసిన శ్రీ గిడ్డాంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చి ఆంజనేయస్వామికి నైవేద్యాలు, ప్రత్యేక కైంకర్యాలు సమర్పించారు. ఇవాళ సాయంత్రం ఆలయ ప్రాంగణంలో గిడ్డాంజనేయ స్వామి కన్నుల పండుగగా జరుగుతున్నట్లు ఆలయ కార్య నిర్వహణాధికారి సాయి కుమార్ తేజ తెలిపారు.