TG: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కాకునూరి సూర్యనారాయణ మూర్తి పంచాంగ శ్రవణం వినిపించారు. యుద్ధం వల్ల ఇతర దేశాల్లో సిలిండర్ల ధరలు పెరిగాయని, భారత్లో పెరగలేదని రామచందర్ రావు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ప్రశాంతంగా ఉందని గుర్తు చేశారు.