SRCL: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువ జాము నుంచి ఆలయంలో పేద పండితుల ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఏకాంతంగా స్వామి వారికి సేవలు నిర్వహించారు. ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు.