MNCL: దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో 400 భక్తులు హనుమాన్ దీక్షను స్వీకరించారు. ఉగాది పండుగ సందర్భంగా గురువారం పలు ప్రాంతాలను భారీగా భక్తులు ఆ దేవాలయానికి తరలి వచ్చారు. వేద పండితుల సమక్షంలో దేవాలయంలోని యజ్ఞశాలలో 400 మంది భక్తులు హనుమాన్ దీక్షను స్వీకరించారు. హనుమాన్ జయంతి వరకు ఈ దీక్ష కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.