MDK: తూప్రాన్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద వాహన డ్రైవర్లు, ఓనర్ల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని చలివేంద్రాన్ని మున్సిపల్ మాజీ ఛైర్మన్ బొంది రాఘవేందర్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జైపాల్ నాయక్, నాయకులు కొక్కొండ కాశిరెడ్డి, వాహన డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు.