GDWL: కొత్త ఏడాది కొత్త ఆశలకు, ఆశయాలకు నాంది పలకాలి అని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలందరూ రాజ్యాంగబద్ధమైన హక్కులు, విధులను గౌరవిస్తూ, సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు సహకరిస్తూ, సమాజంలో సౌహార్ద్ర వాతావరణాన్ని నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు.