SRPT: మేళ్లచెరువు స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు కొంకపాక విష్ణువర్ధన్ శర్మకి తెలంగాణ ప్రభుత్వ విశిష్ట ‘ఉగాది పురస్కారం’ లభించింది. గురువారం హైదరాబాద్లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, డైరెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.