SRD: సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధికి బడ్జెట్లో 10 వేల కోట్ల రూపాయలు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో సంగారెడ్డి లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు. జిల్లాలోని సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో లేవనేత్తాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జయరాజ్ పాల్గొన్నారు.