మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ మరోసారి తండ్రయ్యాడు. ఆయన భార్య, స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారికి ‘రాహా పల్లికల్ కార్తీక్’గా పేరు పెట్టినట్లు వారు తెలిపారు. వీరికి 2021లో కవల మగ పిల్లలు కబీర్, జియాన్ జన్మించారు. కాగా, కార్తీక్ 2007లో నిఖితను వివాహం చేసుకోగా 2012లో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత 2015లో దీపికాను పెళ్లాడాడు.