SKLM: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు అరటి ఎగుమతులు నిలిచిపోవడంతో శ్రీకాకుళం జిల్లాలోని అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేవలం రెండు వారాల్లోనే అరటి టన్ను ధర రూ. 20-23వేల నుంచి రూ. 6-8వేలకు పడిపోయింది. స్థానికంగానూ వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని అరటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.