SRD: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు రూ.26 వేల రూపాయల వేతనం చెల్లించాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు మల్లేశం డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లా కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.