MDCL: ఉగాది పండుగను పురస్కరించుకుని అల్వాల్‌లోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు నూతన సంవత్సరం ‘పరాభవ’ నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అర్చకులు స్వామివారికి అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో మార్మోగింది.