TPT: పాకాల (M)లో నిన్న అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో పాటు గాలులతో కూడిన వర్షం కురిసింది. పగలు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. మామిడి రైతులకు మాత్రం ఈ వర్షం భారీ నష్టాన్ని మిగిల్చింది. రెండు రోజులుగా తేనే మంచు పురుగు నివారణకు మందులు పిచికారీ చేసిన రైతులకు, పూత దశలో ఉన్న తోటలకు నష్టం వాటిల్లితుందని రైతులు లబోదిబోమంటున్నారు.