AP: శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘వేంకటేశ్వర స్వామివారి దివ్య అనుగ్రహం సమస్త భక్తులపై ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి. ఈ ఉగాది పర్వదినం ప్రతి ఇంటికి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్య సమృద్ధులను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శాంతి, అభివృద్ధి ప్రతి ఒక్కరి జీవితంలో వికసించాలని స్వామివారిని వేడుకుంటున్నాను’ అని అన్నారు.