»Software Engineer Committed Suicide In Lord Shiva Temple At Annamayya District
Suicide శివాలయంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. ఐపీఎల్ బెట్టింగ్ లే కారణం?
అనంతరం కొద్దిసేపటికి బయటకు వెళ్లాడు. గ్రామం సమీపంలో ఉన్న శివాలయానికి చేరుకున్నాడు. అక్కడ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా ఉరికి వేలాడుతున్నాడు.
ఏపీలో అన్నమయ్య జిల్లాలో (Annamayya District) విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (Software Engineer) శివాలయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే అతడి ఆత్మహత్యకు ఐపీఎల్ బెట్టింగ్ (IPL Betting)లే కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం దెయ్యల వారిపల్లి గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ రెడ్డి (24) సాఫ్ట్ వేర్ ఇంజనీర్. హైదరాబాద్ (Hyderabad)లోని ఓ కంపెనీలో టెకీగా పని చేస్తున్నాడు. అకస్మాత్తుగా బుధవారం హైదరాబాద్ నుంచి స్వగ్రామం (Village) చేరుకున్నాడు. అనంతరం కొద్దిసేపటికి బయటకు వెళ్లాడు. ఆకులవారిపల్లి గ్రామం సమీపంలో ఉన్న శివాలయానికి (Lord Shiva Temple) చేరుకున్నాడు. అక్కడ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో కుటుంబసభ్యులు (Parents) వెళ్లి చూడగా శ్రవణ్ ఉరికి వేలాడుతున్నాడు.
శ్రవణ్ చేసిన పనితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. హైదరాబాద్ లో మంచిగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం (Job) చేస్తూ అండగా ఉంటాడనుకుంటే అర్ధాంతరంగా తనువు చాలించడంతో తట్టుకోలేకపోయారు. కాగా, ఆ శ్రవణ్ అఘాయిత్యానికి పాల్పడడం వెనుక ఐపీఎల్ బెట్టింగ్ లు కారణంగా తెలుస్తోంది. బెట్టింగ్ లు వేసి డబ్బులు పోగొట్టుకున్నాడని సమాచారం. ఆ మనస్తాపంతోనే ఆత్మహత్యకు (Suicide) పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా తెలిసింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.