గోదావరి నది(Godavari river)లో దొరికే పులస చేపకు డిమాండ్ ఎంత ఉంటుంది..? మహా అయితే వేలల్లో ఉంటుంది. కానీ సముద్రంలో దొరికే కచిడి అనే ఈ ఫిష్‌కు మాత్రం ధర లక్షల్లో పలుకుతుంది. ఎందుకంటే ఈ చేపలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సముద్రంలో చాలా అరుదుగా కనిపించే ఈ చేప ఓ మత్స్యకారుడి వలకు చిక్కుకుంది. దీని బరువు 28 కిలోలు. సాధారణంగా కచిడి చేపలు (Kaciḍi fish) 30 కిలోల కంటె ఎక్కువగా కూడా తూగుతాయి. మొత్తానికి ఈ కచిడి చేప దొరకడంతో మత్స్యకారుడు లక్షాధికారయ్యాడు.మత్స్యకారులకు చిక్కిన అరుదైన చేప.. వేలంలో కళ్లు చెదిరే ధర పలికింది.
అనేక వ్యాధులను నయం చేసేందుకు తయారుచేసే ఔషధాల్లో ఉపయోగించే ‘కచిడి’ చేప.. కాకినాడ (Kakinada) కుంభాభిషేకం రేవులో మత్స్యకారులు వలకి చిక్కింది.వెంటనే ఈ చేపను వేలం వేయగా.. దాదాపు రూ.3.30 లక్షలు పలికింది. ఈ కచిడి చేప బరువు 25 కిలోల దాకా ఉంది. ఇక వేలం వేయడంలో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి రూ.20 వేలు కమిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మత్స్యకారుల చేతికి రూ.3.10 లక్షలు వచ్చినట్లు సమాచారం. కచిడి ఫిష్ పొట్టలోని తిత్తులు ఔషధాల(Medicines)తయారీకి ఉపయోగపడతాయి. సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌తో తయారు చేస్తారని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.
పిత్తాశయం, ఊపిరితిత్తుల (Lungs) మందుల తయారీలో ఎక్కువగా ఈ చేపను ఎక్కువగా ఉపయోగిస్తుంటారని పేర్కొంటున్నారు. అందుకే ఈ చేపకు రూ.లక్షల్లో డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. కచిడి చేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌తో తయారు చేస్తారట. ఇక కాస్లీ వైన్స్(Causley Wines)లో కూడా ఈ చేపను వేయడంతో ఆ వైన్ ధర కూడా ధర ఎక్కువగా పలుకుతుందని ఈ ఫిష్ గురించి పూర్తిగా తెలిసిన వారు చెబుతున్నారు.
The cost of this fish is Rs.3.30 lakhs. Kachidi fish caught by fishermen in Kakinada Kumbhabhishekam jetty 25 kg kachidi fish fetched 3 lakh 30 thousand in the auction #fishing#costlyfishpic.twitter.com/UKLQmX72SG