అదితి త్రిపాఠి (Aditi Tripathi) అనే బాలిక తన మూడవ నుంచే ప్రయాణాలు చేయడం ప్రారంభించింది.10ఏళ్ల వయసులో 50 దేశాల పర్యటించినది. ఈమె మొట్టమొదట సందర్శించిన దేశం జపాన్(Japan). ఇలా ప్రారంభమైన ఈమె సందర్శన నేపాల్, ఇండియా, థాయ్ లాండ్, సింగపూర్ వంటి దేశాల వరకూ విస్తరించింది. ఇక రానున్న రోజుల్లో ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియా చూసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు.ఈమె తండ్రి దీపక్ త్రిపాఠి (Deepak Tripathi) అవిలాష అనే బ్యాంకులో అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. ఇతను సౌత్ లండన్లో తన భార్యతో పాటూ పిల్లలతో కలిసి ఉంటారు.
ఈమె పర్యటనలపై తండ్రి దీపక్ స్పందిస్తూ.. ‘చిన్న వయసులోనే ఇన్ని దేశాలు తిరగడం వల్ల అక్కడి పరిస్థితులు, వ్యక్తులు, సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుస్తుంది. అలాగే సమాజం పట్ల అవగాహన పెరుగుతుంది. ఈ పర్యటనలు తన కూతురు భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.ఏ ప్రాంతానికి వెళ్లాలో ముందుగానే నిర్ణయించుకుని శుక్రవారం సాయంత్రమే తన చిన్నారిని స్కూల్ నుంచి నేరుగా ఎయిర్ పోర్ట్ (Airport) చేరుకునేలా ప్లాన్ చేస్తారు. ఇలా పర్యటనలు అన్నీ ముగించుకొని ఆదివారం రాత్రి 11 గంటలకల్లా హోమ్ టౌన్ చేరుకునేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఇప్పటి వరకూ ఒక్క రోజు ఆప్సెంట్ కూడా తన స్కూల్ రిజిస్టర్లో నమోదు కాలేదని అంటున్నారు.
ఇలా తిరిగేందుకు సంవత్సరానికి 20 వేల పౌండ్లు అవుతుందట’. అంటే మన ఇండియన్ కరెన్సీ(Indian currency) ప్రకారం అక్షరాలా రూ. 21 లక్షలకు పైచిలుకు అనమాట. ఇంత ఖర్చు చేసే ఈ కుటుంబ సభ్యులకు సొంతకారు కూడా లేకపోవడం గమనార్హం. ఎక్కడికి వెళ్ళాలన్నా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ నే వినియోగిస్తారట.ఇక అమ్మాయి విషయానికొస్తే నేను ఇప్పటి వరకూ చాలా దేశాలు తిరిగాను అని తన పర్యటన అనుభవాలను పంచుకున్నారు. నేపాల్(Nepal), అర్మేనియా, జార్జియా అంటే తనకు ఎంతో ఇష్టంగా తెలిపారు.ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించా అని తన తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు. ఈ సందర్శనలో భాగంగా అనేక విషయాలు, విజ్ఞానంతో పాటూ వినోదాన్ని కూడా పొందినట్లు త్రిపాఠి వివరించింది.
చదవండి : Manipur Riots: మణిపుర్ విధ్యంసం వెనుక అసలు కారణాలు ఏంటి?