ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఇష్టపడే కమెడియన్ చార్లీ చాప్లిన్ కూతురు జోసెఫిన్ చాప్లిన్ మృతి చెందింది. నేడు పారిస్లో ఆమె మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ దిగ్గజ హాస్య నటుడు చార్లీచాప్లిన్(Charlie Chaplin) కూతురు నటి జోసెఫిన్ చాప్లిన్ (Josephine Chaplin) మృతిచెందింది. వృద్ధాప్య సమస్యలతో ఆమె కన్నుమూసింది. 74 ఏళ్లున్న జోసెఫిన్ చాప్లిన్ ప్యారిస్(Paris)లో జూలై 13న తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. చార్లీ చాప్లిన్కు 8 మంది సంతానం. అందులో జోసెఫిన్ చాప్లిన్ మూడో బిడ్డ కావడం విశేషం.
జోసెఫిన్ చాప్లిన్ (Josephine Chaplin) కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో 1949లో జన్మించగా మూడేళ్ల తర్వాత తండ్రి చార్లీ చాప్లిన్ (Charlie Chaplin) చనిపోయాడు. అప్పట్లో చార్లీ చాప్లిన్ తీసిన లైమ్లైట్ అనే సినిమా కోసం జోసెఫిన్ మొదటిసారి కెమెరా ముందుకొచ్చి నటించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందింది.
హాలీవుడ్ (Hollywood) చిత్ర పరిశ్రమలో ది కాంటర్ బరీ, డౌన్ టౌన్, ది బేయ్ వంటి కొన్ని సినిమాలు చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అనేక సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక జోసెఫిన్ (Josephine Chaplin)కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆమె మరణ వార్తతో పలువురు నటీనటులు సంతాపం తెలిపారు. హాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతిపట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.