Mahesh Babu: మహేష్ బాబు హాలీవుడ్ లుక్.. ఇది రాజమౌళిదేనా?
టాలీవుడ్లో ఉన్న హాలీవుడ్ కటౌట్ ఏదైనా ఉందా? అంటే, అది మహేష్ బాబు అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అసలు ఆ కటౌట్‌కి ఈపాటికే హాలీవుడ్లో సెటిల్ అయిపోవాల్సింది. కానీ.. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్టుగా.. రాజమౌళి సినిమాతో హాలీవుడ్ గడ్డ పై అడుగుపెట్టబోతున్నాడు మహేష్.
Mahesh Babu: ఈసారి హాలీవుడ్ ఎంట్రీనే కాదు.. ఆస్కార్ అవార్డుల పంటకు రెడీ అవుతున్నారు మహేష్, రాజమౌళి. ప్రస్తుతం హాలీవుడ్ మొత్తం దర్శక ధీరుడు రాజమౌళి వైపే చూస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు జక్కన్నను ఎవరెస్ట్ అంచున నిలబెట్టాయి. అలాంటి దర్శక ధీరుడి నుంచి నెక్స్ ఎలాంటి ప్రాజెక్ట్ రాబోతోంది.. ఎలా ఉండబోతోందని.. యావత్ ప్రపంచం చర్చించుకుంటోంది. ఇప్పటికే రంగంలోకి దిగిపోయాడు దర్శక ధీరుడు. స్క్రిప్టు లాక్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. మహేష్ కూడా ఫిజికల్‌గా రెడీ అవుతున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ లాంచింగ్‌కు ముందు మహేష్ బాబు షేర్ చేస్తున్న ఫోటోలు మాత్రం ఓ రేంజ్లో ఉంటున్నాయి. రాజమౌళి సినిమా కోసం మహేష్‌కు సంబంధించి 8 లుక్స్ రెడీ చేశారనే టాక్ ఉంది. ఈ లుక్ రివీల్ అయ్యే వరకు మహేష్ బయట కనిపించే ఛాన్స్ లేదనుకున్నారు.
కానీ మహేష్ మాత్రం లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తునే ఉన్నాడు. ఆ మధ్య కాస్త గడ్డంతో కనిపించాడు మహేష్. దీంతో.. జక్కన్న సినిమా లుక్ ఇదే అనుకున్నారు. కానీ.. ఇప్పుడు బ్లాక్ కోట్ ధరించి, స్టైలిష్‌గా కూలింగ్ గ్లాస్‌తో హాలీవుడ్ హీరోలను మించి కనిపిస్తున్నాడు మహేష్. మహాశివరాత్రి సందర్భంగా మహేష్ షేర్ చేసిన పిక్ చూసి.. మీది హాలీవుడ్ రేంజ్ సార్.. అరి కామెంట్స్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. అయితే.. మహేష్ లేటెస్ట్ లుక్స్ అన్నీ కూడా యాడ్స్‌కు సంబంధించినవే, అతి త్వరలోనే SSMB 29 లుక్‌లోకి షిప్ట్ అవడానికి రెడీ అవుతున్నాడు. ఏదేమైనా.. లేటెస్ట్ లుక్‌లో మస్త్ ఉన్నాడు మహేష్.