సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తాజాగా ఓ పోస్ట్ చేశారు. ఇంటర్నేషనల్ చెస్ డే (international chess day)సందర్భంగా ఆనంద్ మహీంద్రా చదరంగం ఆడుతున్నట్లుగా ఉన్న ఓ ఫోటోను షేర్ చేశారు. అది తన హనీమూన్ (Honeymoon) నాటి ఫొటో అంటు పెర్కోన్నారు. ఈ విషయాన్ని చెబుతూ మహీంద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ (Viral Photo) అవుతోంది.గ్లోబల్ చెస్ లీగ్ (Global Chess League) జరిగినప్పుడు.. ‘ఎప్పుడైనా చెస్ ఆడారా?’ అని నన్ను చాలా మంది అడిగారు. దీంతో నేను నా పాత జ్ఞాపకాల ఆల్బమ్‌ను శోధించగా ఈ ఫొటో దొరికింది.
ఇది ఆగ్రాలో నా హనీమూన్‌లో తీసుకున్న ఫొటో. రోబోటిక్ (Robotic) చెస్ బోర్డుపై ఆడలేదు. నా భార్య కెమెరా కోసం కేవలం పోజిచ్చానంతే..! అయితే ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో నా చెస్ నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా’’ అని ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) వెల్లగడించారు.ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ ఫొటోను దాదాపు 3లక్షల మంది వీక్షించారు. ‘మీ థ్రో బ్యాక్ ఫొటో (Throw back photo) బాగుందం’టూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.గ్లోబల్ చెస్ లీగ్‌ను ఈ ఏడాది తొలిసారిగా టెక్ మహీంద్రా, అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (Chess Federation) సంయుక్తంగా నిర్వహించింది. ఇందులో ఆరు ఫ్రాంఛైజీలు ఉంటాయి. ఈ ఏడాది జూన్ 21 నుంచి జులై 2 వరకు దుబాయ్ (Dubai) వేదికగా ఈ పోటీలు జరిగాయి.
And speaking of chess, I should have posted this yesterday on #InternationalChessDay ! was asked quite often during the @GCLlive if I played chess myself. So I foraged through my album of memories & found this pic from my honeymoon in Agra. No, that wasn’t a robotic board I was… pic.twitter.com/IYmZZT4tTX