»Fire Accident Fire Breaks Out In Slums Near Delhis Sultanpuri
Fire Accident ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. కాపాడిన రోబోలు
మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు వినూత్నంగా ఈసారి రోబో (Robot)లను వినియోగించినట్లు వెల్లడించారు. రోబోలు సమర్ధవంతంగా పని చేశాయని చెప్పారు. ప్రమాదంలో ప్రజలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంతో స్థానిక ప్రజలు సర్వం కోల్పోయారు.
దేశ రాజధాని ఢిల్లీ (National Capital New Delhi)లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో గుడిసెలు, ఇళ్లల్లో ఉన్నవారు కట్టుబట్టలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అధికారులు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రమాదంలో ప్రజలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంతో స్థానిక ప్రజలు సర్వం కోల్పోయారు. అయితే ప్రమాదానికి కారణం తెలియలేదు.
ఢిల్లీలోని సుల్తాన్ పురి (Sultanpuri)లో మురికివాడలు (Slums) ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. క్రమంగా ఆ మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. మంటలు చెలరేగడంతో ప్రాణాలు రక్షించుకునేందుకు బయటకు పరుగులు తీశారు. పొగతో స్థానిక ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. 15కు పైగా అగ్నిమాపక వాహనాలు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నాయి. కాగా పరిస్థితి అదుపులో ఉందని డివిజనల్ అగ్నిమాపక (Fire Station) అధికారి ఏకై జైశ్వాల్ (AK Jaiswal) తెలిపారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. అయితే మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు వినూత్నంగా ఈసారి రోబో (Robot)లను వినియోగించినట్లు వెల్లడించారు. రోబోలు సమర్ధవంతంగా పని చేశాయని చెప్పారు. ప్రమాదంతో తాము సర్వం కోల్పోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.