»Ap Minister Audimulapu Suresh Fire On Media In Vizag
Garbage Tax ఎవరయ్యా చెప్పింది? అంటూ మీడియాపై ఏపీ మంత్రి చిందులు
రాజకీయ దురుద్దేశంతోనే ఇది చెబుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం బాదుడే బాదుడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జగన్ ప్రభుత్వం వేస్తున్న పన్నులకు సరికొత్త పేరు పెట్టిన విషయం తెలిసిందే. ‘జే ట్యాక్స్ (J Tax)’ అంటూ కొత్త పేరుతో సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఆ జే ట్యాక్స్ లో భాగంగానే చెత్తపై కూడా పన్ను వేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
తీరొక్క పన్నులు (Tax) వేసి ప్రజలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం పీల్చుకు తింటున్నదని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)తో పాటు జనసేన (Jana Sena Party), వామపక్షాలు (Communits), బీజేపీ (BJP) పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. మద్యం అమ్మకాలు, మాంసం దుకాణాల ఏర్పాటుపై దుమ్మెత్తిపోస్తున్నాయి. జగన్ ప్రభుత్వం వేస్తున్న పన్నులకు సరికొత్త పేరు పెట్టిన విషయం తెలిసిందే. ‘జే ట్యాక్స్ (J Tax)’ అంటూ కొత్త పేరుతో సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఆ జే ట్యాక్స్ లో భాగంగానే చెత్తపై కూడా పన్ను వేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ పన్ను విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దీనిపై మీడియాను ప్రశ్నించగా ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ (Audimulapu Suresh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎవరయ్యా చెత్త పన్ను (Garbage Tax) వేశాడు? చెత్త పన్ను.. చెత్త పన్ను అంటూ అంటున్నారని ప్రశ్నించిన మీడియాపైనే ఎదురు తిరిగాడు. ఈ సందర్భంగా చెత్త పన్నుకు సరికొత్త అర్థం చెప్పాడు.
త్వరలో కాబోయే పరిపాలన రాజధాని విశాఖపట్టణం (Visakhapatnam)లో గ్లోబల్ సమ్మిట్ (Global Investors Summit) ఏర్పాట్లను గురువారం మున్సిపల్ శాఖ మంత్రి సురేశ్ పరిశీలించారు. ప్రభుత్వం ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులకు పనులపై సమీక్ష చేసి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రిని గ్లోబల్ సమ్మిట్ సదస్సు ఏర్పాట్ల విషయంపై మాట్లాడించింది. ఈ క్రమంలోనే కొందరు మీడియా మిత్రులు చెత్త పన్ను విషయమై ప్రస్తావించారు. ఈ ప్రశ్న వేయగానే సురేశ్ లో కోపం తన్నుకుంటూ వచ్చింది. ‘ఎవరయ్యా చెప్పింది చెత్త పన్ను అని? ఏం మాట్లాడుతున్నారు? చెత్త పన్ను మేం ఎక్కడ వేశామయ్య? దాన్ని చెత్త పన్ను అని ఎందుకంటారు మీరు? ఎవరయ్యా చెప్పింది? తెలుగుదేశం పార్టీ వారు ఏమో ప్రభుత్వాన్ని బద్నామ్ చేసేందుకు చెత్త పన్ను అంటోంది. అరె బాబు అది కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. చెత్త విషయంలో ప్రతి గడప నుంచి సేకరించాలనే విషయంలో క్లాప్ అనే కార్యక్రమం ప్రభుత్వం ప్రారంభించింది. చెత్త వాహనాల సేకరణకు వాహనాలు, అత్యాధునిక పరిజ్ణానం అందుబాటులోకి తీసుకొచ్చాం. బయో మైనింగ్, సాలిడ్ వేస్టింగ్ మేనేజ్ మెంట్ కింద యూజర్ చార్జీలు వసూలు చేస్తున్నాం. ఇది యూజర్ చార్జీలు’ అంటూ కొత్త అర్థం ఇచ్చారు.
‘గతంలో చెత్త సేకరణ ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో గమనించండి. స్వచ్ఛ భారత్, క్లీన్ ఆంధ్రప్రదేశ్ చక్కగా అమలు చేస్తున్నాం. దీనికి యూజర్ చార్జీలు వసూలు చేస్తున్నాం. దీనికి చెత్త పన్ను అని చెప్పడం సరికాదు’ అని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు. ‘రాజకీయ దురుద్దేశంతోనే ఇది చెబుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం బాదుడే బాదుడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు’ అని తెలిపారు. కాగా తన శాఖ పరిధిలోని అంశాలపై గ్లోబల్ సమ్మిట్ సదస్సులో మంత్రి సురేశ్ ప్రసంగం చేసే అవకాశం ఉంది.