»Telangana It Minister Ktr Wishes Ap For Global Investors Summit
Telangana Minister KTR: ఆ న్యూస్ షేర్ చేసి… ఆంధ్రప్రదేశ్‌కు విషెస్ చెప్పిన కేటీఆర్
పెట్టుబడుల (Investments) సమీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Government of Andhra Pradesh) రేపటి నుండి (మార్చి 3, 4 తేదీలు) విశాఖపట్నం (Visakhapatnam)లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ (Global Investors Summit) నేపథ్యంలో తెలంగాణ (Telangana) మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (IT Minister) తోటి తెలుగు రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలిపారు.
పెట్టుబడుల (Investments) సమీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Government of Andhra Pradesh) రేపటి నుండి (మార్చి 3, 4 తేదీలు) విశాఖపట్నం (Visakhapatnam)లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ (Global Investors Summit) నేపథ్యంలో తెలంగాణ (Telangana) మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (IT Minister) తోటి తెలుగు రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, విశాఖ కూడా అభివృద్ధి చెందవలసి ఉందని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలతో కూడిన న్యూస్ పేపర్ కట్టింగ్ ను పోస్ట్ చేసి, ట్వీట్ చేశారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అత్యుత్తమ స్థానాల్లో ఉండాలని పేర్కొన్నారు. హైదరాబాద్ ను అమర్ నాథ్ బిగ్ బ్రదర్ అని సంబోధిస్తే… వైజాగ్ ను కేటీఆర్ యంగర్ బ్రదర్ అని, అలాగే ఆంధ్రప్రదేశ్ ను సిస్టర్ స్టేట్ అంటూ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ తదితర చోట్ల పారిశ్రామికవేత్తలతో సన్నాహక సదస్సులను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. హైదరాబాద్ ను ఏపీకి బిగ్ బ్రదర్ గా సంబోధించారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి గర్వపడుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం ప్రమోట్ చేస్తానని కలలో కూడా అనుకోలేదన్నారు. బిగ్ బ్రదర్ హైదరాబాద్ (Hyderabad) అభివృద్ధిని చూసి గర్వంగా ఉందని తెలిపారు. విశాఖలో జరిగే సమ్మిట్ కు రావాలని హైదరాబాద్ వ్యాపారవేత్తలను కోరారు. ఎనిమిదేళ్ల క్రితం జాయింట్ ఫ్యామిలీ వలె విడిపోయామని, రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి విషయంలో పరస్పరం సహకరించుకోవాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఏపీ ప్రజల పాత్ర ఉందని, ఇప్పుడు ఏపీ అభివృద్ధికి సహకరించాల్సిన సమయం వచ్చిందన్నారు. హైదరాబాద్ వలె విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. తనకు నమ్మకం ఉందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, వెలుగులో మీ అందరి (Hyderabad Investors) సహకారం ఉండాలని, ఉంటుందని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఒకరి ఆలోచనలు ఒకరం, పరస్పర పెట్టుబడులతో ముందుకు వెళ్దామన్నారు.
కాగా, ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. రూ.2 లక్షల వరకు పెట్టుబడులు వస్తాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్లలో కేటాయింపులకు 48వేల ఎకరాలు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎంపిక చేసిన 14 రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఐటీ, హెల్త్, ఫార్మా, టూరిజం, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పునరుత్పాదక ఇంధనం, డిఫెన్స్, ఏరోస్పేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్, లాజిస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మేరీటైమ్ తదితర రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఎర్లీబర్డ్ కింద జీఐఎస్ లో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఉంటాయి. 24 దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారు. అలాగే, ప్రస్తుత పారిశ్రామిక విధానం మార్చితో ముగియనున్న నేపథ్యంలో కొత్త విధానాన్ని తీసుకు రానున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సరికొత్తగా సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.