WGL: ముఖ్యమంత్రి సహాయనిధి పేదల ప్రజల పాలిట వరంగా నిలుస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని చింతగట్టు గ్రామానికి చెందిన మాచర్ల నిహార్ష్ కి రూ.5,00,000/-ల సీఎం సహాయ నిధిని ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని మంజూరు చేయించారు. ఈ LOC కాపీనీ MLA లబ్ధిదారు కుటుంబసభ్యులకు హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.