KRNL: కర్నూలులో జరిగిన షేక్ ఇజహర్ అహ్మద్ హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు DSP బాబు ప్రసాద్ తెలిపారు. నిందితుల నుంచి 3కత్తులు, స్కూటీ స్వాధీనం చేసుకుని వివరాలు వెల్లడించారు. పాత గొడవల కారణంగా ఇమ్రాన్, ఇర్ఫాన్, షేక్ జాహీన్ అహ్మద్, SMD ఇర్ఫాజ్, యూసుఫ్ కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఇమ్రాన్, ఇర్ఫాన్, షేక్ జాహీన్ అహ్మద్‌ను అరెస్టు చేశామని వివరించారు.