SKLM: మండలంలోని లోకొండ గిరిజన గ్రామంలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. 40 ఏళ్ల కిందట గ్రామంలో ఈ పాఠశాల నిర్మించారని స్థానికులు తెలిపారు. పాఠశాలపై కప్పు స్లాబ్ పెచ్చులూడి విద్యార్థులపై పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.