AP: పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నరసరావుపేటలోని ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. వైసీపీ ఇవాళ అన్నదాత పోరు నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనికి అనుమతి లేదని.. ముందు జాగ్రత్త చర్యగా ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.