KMM: బీజేపీ రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించగా ఖమ్మం నగరానికి చెందిన నాయకుడు దేవకి వాసుదేవరావుకు స్థానం దక్కింది. ఆయనను రాష్ట్ర కోశాధికారిగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, జిల్లా పార్టీ శ్రేణులు తదితరులు వాసుదేవరావును శాలువా కప్పి అభినందించారు.