KNR: ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపూర్ రిజర్వాయర్‌కు గోదావరి జలాలను విడుదల చేయనున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సంబంధిత సీఈతో మాట్లాడగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. నీటి విడుదలపై ఈ నిర్ణయం రైతులు, ప్రజల్లో ఆశలు నింపిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.