SRPT: క్షయ రహిత సమాజం కోసం టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా వైద్య శాఖ కృషి చేస్తుందని మండల వైద్యాధికారి వేణు గోపాల్ తెలిపారు. ఇవ్వాళ హుజూర్నగర్లో నిర్వహించిన చాతి ఎక్సరే శిబిరంలో ఆయన మాట్లాడారు. 2025 నాటికి దేశంలో క్షయవ్యాధిని నిర్మూలించడమే టీబీ ముక్త్ భారత్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ శిబిరంలో 115 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.