KMM: ఖమ్మం 4వ డివిజన్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు లబ్ధిదారుడు పిట్టల ఉపేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డివిజన్ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.