WNP: పెబ్బేరు మండలం రంగాపూర్‌లో వరి పంటలకు సోకుతున్న తెగుళ్లపై మండల వ్యవసాయ అధికారి షేక్ మున్నా రైతులకు అవగాహన కల్పించారు. మంగళవారం క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి, తెగుళ్లను గుర్తించి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. తెగుళ్లను నివారించేందుకు అవసరమైన పురుగుమందులను పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. మండలంలో యూరియా కొరత లేకుండా సమర్థవంతంగా పంపిణీ చేశారు.