SKLM: కొల్లవానిపేట ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఎంఈవో పేడాడ దాలినాయుడు సందర్శించారు. ప్రార్థనా సమయం అనంతరం విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అలాగే ఇటీవల జరిగిన ఎఫ్ ఏ -1 ఎగ్జామ్స్, అసెస్మెంట్ బుక్స్‌ను తరగతుల వారీగా పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు అచ్యుతరావు, విద్యార్థులు పాల్గొన్నారు.