BDK: మణుగూరు మండలం గోల్డ్ షాప్ లైన్ పైలెట్ కాలనీ నందు పాలది సత్యనారాయణ (సత్యం డాక్టర్. RMP) అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సత్యనారాయణ పార్థవదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సుపరిచితుడైన సత్యనారాయణ మృతి తనను కలిసివేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.