VZM: జిల్లా వ్యాప్తంగా యూరియాపై రైతులకు అవగాహన కల్పించాలని MEOలకు కలెక్టర్ ఆదేశాల జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్తవలస మండల MEO రవిప్రకాష్ పలు గ్రామాల్లో రైతు సేవ కేంద్రాల వద్ద రైతులకు యూరియా నిల్వలు, సరఫరా, వినియోగంపై సోమవారం అవగాహన కల్పించారు. DAP, యూరియా నిల్వలున్నాయని రైతులు ఆందోళన చెందవద్దన్నారు. నానో యూరియా వాడటం వల్ల అధిక దిగుబడులు వస్తాయని పేర్కొన్నారు.