ATP: సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభకు ప్రజల రవాణా కోసం 3,050 బస్సులు అందుబాటులో ఉంచినట్టు ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు తెలిపారు. జోన్-4 నుంచి 2,300, జోన్-3 నుంచి 750 బస్సులు, అదనంగా 500 ప్రైవేట్ బస్సులు సిద్దం చేశామని పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 13 నియోజకవర్గాల నుంచి బస్సులు తరలిస్తామని వెల్లడించారు.