ADB: హైదరాబాద్లోని గాంధీ భవన్లో మంగళవారం జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హాజరయ్యారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల అమలు తీరు, రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై అధిష్టానంతో ఎమ్మెల్యే వివరించారు.