TG: కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ అహంకారం, ఆలోచనా విధానమే కాంగ్రెస్ వైఫల్యాలకు కారణమన్నారు. ‘ఉంటే తమతో ఉన్నారు.. లేదంటే వారితో ఉన్నారు..’ అనే వాదన సరికాదన్నారు. తాము కాంగ్రెస్, బీజేపీకి బీ టీమ్ కాదన్నారు. తెలంగాణ ప్రజలకు మాత్రమే ఏ టీమ్ అని పేర్కొన్నారు. తమపై కోపం చూపడం కాదని, సొంత వైఫల్యాలపై దృష్టి పెట్టాలన్నారు.