E.G: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా గండేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల వెంకన్న చౌదరి నియమించబడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు మంది బోర్డు డైరెక్టర్లుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. కాకినాడ జిల్లా నుంచి మోహన్ రావుకు అవకాశం రావడం అదృష్టమంటున్నారు.