తీవ్ర గాయాలవడంతో బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఏం జరిగిందని ఆరా తీయగా పిల్లాడు నోరు విప్పాడు. ఈ దారుణ ఘటన విషయమై బాలుడి తల్లిదండ్రులు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ (Mylardevpally Police Station)లో ఫిర్యాదు చేశారు. కాగా గాయాలపాలైన బాలుడిని ఆస్పత్రికి తరలించారు.
ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి (Marijuana) విక్రయాలు మాత్రం యథేచ్చగా జరుగుతున్నాయి. ఆ గంజాయి మత్తు చాలా ప్రమాదకరం. అది సేవించిన వారి ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. అయినా కూడా మత్తులో మునిగేందుకు చాలా మంది గంజాయి పీలుస్తున్నారు. ఈ గంజాయి మైకంలో దారుణాలకు పాల్పడ్డుతున్నారు. తాజాగా హైదరాబాద్ (Hydrabad) శివారులో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. బాలుడిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడింది. బాలుడి బట్టలు విప్పి.. బెల్టుతో కొడుతూ చిత్రహింసలకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా (RangaReddy District) మైలార్‌దేవ్‌పల్లి (Mylardevpally)లో చోటుచేసుకుంది.
గంజాయి సేవించిన మహమ్మద్ సైఫ్, అబ్బూ, సమీర్‌తోపాటు మరో ఐదుగురు మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ కిరాణా దుకాణానికి వచ్చారు. దుకాణంలో కూర్చున్న బాలుడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో మత్తులో ఉన్న వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలుడిని ఎత్తుకెళ్లారు. బలవంతంగా సమీపంలోని గుట్టల వద్దకు తీసుకెళ్లారు. గంజాయికి డబ్బులు ఇవ్వాలని బాలుడి బట్టలు విప్పి బెల్ట్, కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలోనే మా ఇంట్లో చెబుతానని బాలుడు ‘నీకు దిక్కున్న చోట చెప్పుకో పో.. ఇప్పటికే ఇద్దరిని హత్య చేశాం’ అని ఆ దుండుగులు చెప్పినట్లు తెలుస్తున్నది. అయితే ఈ చిత్రహింసలు తాళలేక గంజాయి గ్యాంగ్ నుంచి బాలుడు ఎలాగోలా తప్పించుకొని ఇంటికి చేరుకున్నాడు.
తీవ్ర గాయాలవడంతో బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఏం జరిగిందని ఆరా తీయగా పిల్లాడు నోరు విప్పాడు. ఈ దారుణ ఘటన విషయమై బాలుడి తల్లిదండ్రులు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ (Mylardevpally Police Station)లో ఫిర్యాదు చేశారు. కాగా గాయాలపాలైన బాలుడిని ఆస్పత్రికి తరలించారు. వారి ఫిర్యాదు మేరకు మహమ్మద్ సైఫ్, అబ్బూ, సమీర్‌తోపాటు మరో ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు తెలిపారు. గంజాయి సరఫరాను కట్టడి చేయాలని ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కోరుతున్నారు. గంజాయి వలన తమ ప్రాంతంలో తరచూ ఏదో ఒక సంఘటన చోటుచేసుకుంటుందని స్థానికులు (Local People) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.