కుటుంబ కలహాల (Family Clashes) నేపథ్యంలో భార్యను హత్య చేసి ఆపై విషం Poison) తాగి ఓ ఆర్ఎంపీ వైద్యుడు (RMP Doctor) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తల్లిని హత్య చేయడం అడ్డుకుంటుండగా కుమారుడిపై కూడా తండ్రి దాడికి యత్నించాడు. బయటకు పరుగెత్తడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో (RangaReddy District) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి (Shankarpally) మండలం జన్వాడ (Janwada) గ్రామంలో ఐదు నెలలుగా ఆర్ఎంపీ వైద్యుడు నాగరాజు, సుధ దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. తరచూ భార్యాభర్తల (Wife and Husband) మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి కూడా వాగ్వాదం జరిగింది. గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఆగ్రహానికి గురైన నాగరాజు కత్తితో భార్య సుధ గొంతుకోశాడు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. అయితే తల్లిని చంపుతుండగా తండ్రికి పెద్ద కుమారుడు దీక్షిత్ (8) అడ్డు తగిలాడు. అమ్మను చంపొద్దు అంటూ అడ్డగించడంతో కుమారుడిపై కూడా నాగరాజు హత్య చేసేందుకు ప్రయత్నించాడు. భయంతో బయటకు పరుగులు తీశాడు. అనంతరం భర్త నాగరాజు విషయం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి ఈ ఘోరం జరిగిపోయింది.
బాలుడు గ్రామంలో ఇతరులకు చెప్పడంతో వారి సమచారంతో నార్సింగి పోలీసులు (Narsing Police) ఘటన స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించి మృతదేహాలను హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా బాలుడితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.