RTC Busలోనే జిప్ ఓపెన్ చేసి *పని* కానిచ్చిన యువకుడు.. పట్టుకుంటే పరార్
ఆ యువకుడు నిలబడినప్పుడు ప్యాంట్ బెల్ట్ తీసి ఉంది. ఇగో చూడండి జిప్ తెరచి ఉంది అని నందిత చెప్పింది. ఆగమ్మా పోలీసులకు ఫిర్యాదు చేద్దామని కండక్టర్ చెప్పాడు. దీనికి భయపడిన యువకుడు బస్సు దిగాడు.
ఓ యువకుడు ఆర్టీసీ బస్సులోనే (RTC Bus) దారుణానికి ఒడిగట్టాడు. మహిళల (Women) పక్కన కూర్చుని ప్యాంట్ జిప్ (Pant Zip) తెరచి హస్త ప్రయోగానికి ప్రయత్నించాడు. ఇది గ్రహించిన ఓ యువతి అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అయితే కండక్టర్ (Conductor)తో కలిసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఆ యువకుడు అందరినీ తోసేసి తప్పించుకు పారిపోయాడు. ఈ సంఘటన కేరళలో (Kerala) చోటుచేసుకుంది.
కేరళలోని ఎర్నాకులం జిల్లాలో (Ernakulam District) మే 17వ తేదీన బుధవారం మధ్యాహ్నం త్రిసూర్ నుంచి కొచ్చికి ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తోంది. ఈ బస్సులో ఓ యువతి పక్కన కూర్చున్న ఓ యువకుడు బ్యాగ్ ను అడ్డం పెట్టుకుని ప్యాంట్ జిప్ తీశాడు. హస్త ప్రయోగం (Masturbating) చేస్తున్నాడు. అతడి ప్రవర్తనతో పక్కన కూర్చున్న మహిళలు ఇబ్బందులు పడ్డారు. ఇది గ్రహించిన ఓ నందిత సంకర (Nandita Sankara) అనే యువతి వీడియో తీసింది. అలా ప్రవర్తించడం సరికాదని చెబుతూ.. చేయి తీయండి అని సూచించింది. ఏం తెలియనట్టు అతడు ప్రవర్తించాడు. యువతి స్వరం పెంచడంతో ఆ యువకుడు బస్సు దిగేందుకు ప్రయత్నించాడు.
అక్కడే ఉన్న కండక్టర్ విషయం చెప్పింది. ఆ యువకుడు నిలబడినప్పుడు ప్యాంట్ బెల్ట్ (Belt) తీసి ఉంది. ఇగో చూడండి జిప్ తెరచి ఉంది అని నందిత చెప్పింది. ఆగమ్మా పోలీసులకు ఫిర్యాదు చేద్దామని కండక్టర్ చెప్పాడు. దీనికి భయపడిన యువకుడు బస్సు దిగాడు. కండక్టర్ అతడిని గట్టిగా పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకుని వెంటనే పరుగెత్తుకుంటూ రోడ్డు దాటాడు. అటు నుంచి పారిపోయాడు. ఈ సంఘటనను అంతా నందిత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ నిందుతుడిని కనిపెట్టేందుకు సహకరించాలని కోరింది.
ఈ వీడియో వైరల్ (Viral)గా మారింది. ఆ యువకుడి తీరుపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు అతడి ఆచూకీ లభించింది. అతడి పేరు సయద్ కేకే అని తెలిసింది. త్వరలోనే అతడిని గుర్తించి పోలీసులకు పట్టించనున్నారు. కాగా యువతి చూపిన చొరవకు అందరూ అభినందిస్తున్నారు.