»Ats Officials Trying To Reveal Plans Of Terrorist Module Plan
Terrorist Gang దేశంలో భారీ ఉగ్రకుట్ర.. 16 మంది అరెస్ట్ తో తప్పిన ముప్పు
ఆ ఫోన్ లో డేటా పరిశీలిస్తే దారుణాలు వెలుగులోకి వచ్చాయి. వారికి ఒకరి నుంచి సందేశాలు అందాయి. దేశంలో ఆత్మహుతి దాడులకు సిద్ధం కావాలని ఆ సందేశంలో ఉంది. వీరు పరస్పరం సమాచారం కోసం రాకెట్ చాట్, త్రీమా యాప్స్ వినియోగించారు.
హైదరాబాద్ (Hyderabad), భోపాల్ (Bhopal)లో అరెస్ట్ చేసిన ఉగ్రవాద ముఠాల (Terrorist Gang) నుంచి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రెండు నగరాలే కాదు దేశవ్యాప్తంగా భారీ కుట్రకు పాల్పడాలనేదే వారి లక్ష్యమని తెలిసింది. దీనికోసం ఆత్మహుతి దాడులు, విధ్వంసాలు సృష్టించడం.. వరుస హత్యలకు పాల్పడడం వంటి ఘోరమైన ఆలోచనలకు ప్రణాళికలు రూపొందించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. దీంతో వారి ఆలోచనలు, ప్రణాళికలు విన్న అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల హైదరాబాద్ తో పాటు భోపాల్ లో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) (Madhya Pradesh Anti-Terrorism Squad -ATS) దాడులు చేసి ఏకంగా 16 మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీరి అరెస్ట్ దేశంలో తీవ్ర అలజడి రేపింది. అరెస్ట్ చేసిన వారిలో మహ్మద్ సలీం, యాసీర్ ఖాన్ తో పాటు మరో వ్యక్తి నుంచి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ లో డేటా పరిశీలిస్తే దారుణాలు వెలుగులోకి వచ్చాయి. వారికి ఒకరి నుంచి సందేశాలు అందాయి. దేశంలో ఆత్మహుతి దాడులకు సిద్ధం కావాలని ఆ సందేశంలో ఉంది. వీరు పరస్పరం సమాచారం కోసం రాకెట్ చాట్, త్రీమా యాప్స్ వినియోగించారు.
ఒకేసారి పెద్ద సంఖ్యలో మనుషుల్ని చంపడం అంటే మారణ హోమం (మాస్ కిల్లింగ్), సాబోటేజ్ అంటే విధ్వంసాలు, అల్లర్లు సృష్టించడం, ఎంపిక చేసుకున్న వ్యక్తులను చంపేయడం (టార్గెట్ కిల్లింగ్)తోపాటు అతి ప్రమాదకరమైన పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగే ఆత్మహుతి (ఫిదాయిన్) దాడులకు సిద్ధంగా ఉండాలని ఆ సందేశంలో ఉంది. ఈ సందేశం పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత దర్యాప్తును ఏటీఎస్ అధికారులు చేస్తున్నారు.